న్యాయవాదుల హక్కులను హరించేందుకు కేంద్రం కుట్ర

Tea India Rajahmundry

న్యాయవాదుల హక్కులను హరించేందుకు కేంద్రం కుట్ర

ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడా

రాజమహేంద్రవరం/సెప్టెంబరు27(న్యూస్) :

కేంద్రప్రభుత్వం కార్పొరేట్, విదేశీ కంపెనీలతో కలిసి న్యాయవాదులపై కుట్ర చేస్తోందని ఆంధ్రాలోయర్స్ అసోసియేషన్(ఎఎల్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా శ్రీనివాస్ ఆరోపించారు. భారత్ న్యాయవాదులవృత్తిని, హకులను బలహీనపరిచి న్యాయవాదుల ప్రతిష్టను కాలరాడటానికి లా కమిషన్ 20వ ఉపోద్దురా 191 న్యాయవాదుల హక్కులను కాలరాసే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రం 2017 సంవత్సరం సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి న్యాయవాదులపై వృత్తిపరమైన దాడికి పూనుకుంటోందని, ఈ తరహా బిల్లు కారణంగా న్యాయవాదులను రాజకీయ బానిసలుగాను, న్యాయవాడ కూలీలను మార్చే ప్రమాదం పొంచివుందని, ఈ సవరణ బిల్లు ఎగువ, దిగువ సభల్లో పాస్ అయితే సాధారణ, మధ్యతరగతి న్యాయవాదులు అందరూ వృత్తిపరమైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. భారత్ మేధావి వర్గాలలో న్యాయవాద వృత్తి అని ప్రధానమైనదని, సవరణ బిల్లు ముసుగులో న్యాయవాదులను నేరుగా బెదిరింపులు, బ్లాక్ మెయిల్స్ కు గురిచేయవచ్చునని, కొన్ని విదేశీ వర్తక, వ్యాపార సామ్రాజ్యాన్ని, కార్పొరేట్ శక్తుల సామ్రాజ్యం భారత్లో విస్తరించటానికి భారత్ న్యాయవాదుల నైపుణ్యత క శక్తులకు అడ్డుతగులుతాయని గ్రహించిన వ్యాపార మేధావివర్గం కేంద్రప్రభుత్వంపై వత్తిడి పెంచి ముందుగా న్యాయవాద వృత్తిని, శక్తిని బలహీనపరిచే కుట్ర wరుపుతున్నారని ఆయన విమర్శించాడు. ఎప్పుడైతే ఈ సవరణ బిల్లు ద్వారా న్యాయవాదులను భయభ్రాంతులకు గురిచేస్తే తదుపరి అంతర్జాతీయ వ్యాపార సామ్రాజ్యానికి భారతిలో ఎదురు లేకుండా పోయి న్యాయవ్యవస్థను శాసిస్తూ భారత్ పై పెత్తనం సాగిస్తారని ఆయన ఆందోళన చెందారు. ఈ సవరణ బిల్లులో కక్షిదారులకు న్యాయవాదుల పై అవసరం లేని పెత్తనం కల్పించి న్యాయవాది నుంచి ఐదు లక్షల వరకు జరిమానా, నష్టపరిహారం కల్పించేవిధంగా బిల్లులో పొందుపరిచారని, న్యాయవాదుల మధ్య, కక్షిదారులు సుధ వుండవలిసిన సన్నిహిత సంబంధాలు, నమ్మకం మాత్రమేనని, అలాంటి బంధాలను కేంద్ర ప్రభుత్వం కలుషితం చేయాలనుకోవటం అన్యాయమైన చర్య అని ఆయన పేర్కొన్టారు. సెక్షన్ 24వ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగిపై ఆరోపణ రుజువు అయితే ఆ ఉద్యోగిని ఈ సెక్షన్ ప్రకారం తొలగిస్తారని, సవరణ బిల్లులో ఈ సెక్షన్ లో న్యాయవాదులను చేర్చి న్యాయవాద వృత్తి నుండి తొలగించేవిధంగా కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ సెక్షన్తో న్యాయవాదుల పై చర్యలు చేయాలనుకుంటున్నప్పుడు న్యాయవాదులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు, అన్ని అర్హతలు కల్పించాలనే ఆలోచన కేంద్రం చేయకపోవటం న్యాయవాదుల దురదృష్టమని ఆయన గుర్తు చేసారు. సెక్షన్ 41 ప్రకారం వృత్తిపరమైన స్వల్ప తప్పిదాలను భూత అద్దంలో చూపి న్యాయవాదుల పై మానసికదాడి జరిపే వెసులుబాటుకు కేంద్రం మార్గం చేసుకుంటోందన్నారు. సెక్షన్ 35ఎ ప్రకారం న్యాయవాదుల వృత్తిపరమైన స్వేచ్చపై భౌతిక దాడి జరిపే రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఈ సవరణ బిల్లులో న్యాయమూర్తులకు, కక్షిదారులకు శృతిమించిన అధికారాలను కల్పించి న్యాయవ్యవస్థను కలుషితం చేసే ప్రయత్నం జరుగుతోందని, రాజకీయ కాలుష్యం కారణంగా సమాజంలో జరిపే కొన్ని వ్యాపార విషవాయువులను భారత్ న్యాయవాదులు మాత్రమే వారి మేధస్సుతో అడ్డుకట్ట వేసి సమాజాన్ని కలుషితం కాకుండా కొంతమేరకు అడ్డుకునేది. న్యాయవాదులు మాత్రమే అని ఆయన తెలిపారు. న్యాయవాదుల హక్కులపై ఏదైనా చట్టసవరణలు చేయాలని అనుకున్నప్పుడు న్యాయవాద సంఘాలు, బార్ కౌన్సిల్ అభిప్రాయాలను ‘లా కమిషన్ పరిగణనలోకి తీసుకోవాల్సివుందన్నారు. అలా కాకుండా రాజకీయ వత్తిడిలతో ఏకపక్ష నిర్ణయాలతో రిపోర్టులను రికలను చట్టసభలలో ప్రవేశ పెట్టాకూడదని, ఈ ఆలోచన చేయకపోవడం వెనుక జరుగుతున్న రాజకీయ, విదేశీ, స్వదేశీ, కార్పొరేట్ శక్తుల కుట్రను భారత్ న్యాయవాదులు గ్రహిస్తున్నారని ఆయన హెచ్చరించారు. 2017 సవరణ బిల్లు ద్వారా న్యాయవాదులపై ఈ విషపుదాడిని భారత న్యాయవాదులందరూ ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉ ఐదాలని మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నష్టం జరిగిన తర్వాత ఉద్యమాలకు సిద్దపడటం కన్నా ముందుగా వ్యాయవాద సంఘాల ద్వారా, బార్ కౌన్సిల్ ద్వారా కేంద్రప్రభుత్వానికి అధికారికంగా లేఖలు వ్రాయాలని, సవరణ బిల్లును కేంద్రం తక్షణం నిలిపివేసి న్యాయవాదుల భద్రత, సంక్షేమానికి కృషి చేయాలన్నారు. కేంద్రం కుట్ర ప్రయత్నాలు ఆపకపోతే న్యాయవాదులు భవిష్యత్ కార్యాచరణకు సిద్దంగా ఉండాలని ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్(ఎఎల్ఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు.