ఆదిరెడ్డి ఆర్ధిక సహాయంతో చిన్నారికి వైద్యం

Tea India Rajahmundry
ఆదిరెడ్డి ఆర్ధిక సహాయంతో చిన్నారికి వైద్యం
– దాతలు సహకరించాలని విజ్ఞప్తి
రాజమహేంద్రవరం/అక్టోబర్ 04(prime news) :
వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారికి వైద్య సహాయం నిమిత్తం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) భవానీ ఛారిటబుల్‌ ట్రస్టు తరపున ఆర్ధిక సహాయం అందచేశారు. స్థానిక 42వ డివిజన్‌ మున్సిపల్‌ కాలనీ వాంబే గృహాలకు చెందిన జె రామారావు నాలుగేళ్ల కుమార్తె జె మాధురి ప్రియకు చిన్నతనం నుంచి వినికిడి సమస్య ఉంది. మాధురి ప్రియ తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులను సంప్రదించారు. ఈ నేపధ్యంలో గుంటూరుకు చెందిన ఈఎన్‌టి నర్సింగ్‌ ¬మ్‌ మాధురి ప్రియకు శస్త్ర చికిత్స చేసేందుకు రాగా వైద్యం కోసం సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మాధురి ప్రియ వైద్యం నిమిత్తం రూ. 5.20 లక్షలు మంజూరు కాగా మిగిలిన సొమ్ము మాధురి తల్లిదండ్రులు దాతల నుంచి సహాయం అభ్యర్ధిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలువగా భవానీ ఛారిటబుల్‌ ట్రస్టు నుంచి కొంత మేర ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరే సహాయం కావాలన్నా తమను సంప్రదించవచ్చని, శస్త్ర చికిత్సకు వెళ్లే ముందు తమను మరో మారు కలవాలని సూచించారు. అలాగే దాతలు ముందుకు వచ్చి చిన్నారి మాధురి ప్రియకు వైద్యం సహాయం నిమిత్తం సహకారం అందించాలని కోరారు. వైద్య సహాయం చేయాలనుకునే వారు 9908829705, 7075605914 నెంబర్లను సంప్రదించాలని కోరారు. చిన్నారి కళ్లల్లో ఆనందం చూసేందుకు బాధ్యత కలిగిన వారంతా సహాయం చేసేందుకు ముందుకు రావాలని ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.