వైసీపీ అరకు ఎంపీ వివాహం – హాజరుకానున్న సీఎం

Tea India Rajahmundry

వైసీపీ అరకు ఎంపీ వివాహం…
వైసీపీ ఎంపీ వివాహం… హాజరుకానున్న సీఎం

విశాఖ\ అక్టోబర్ 06(primenews)

విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఓ ఇంటివారు కాబోతున్నారు. ఈనెల 17న శివప్రసాద్‌తో ఆమె వివాహం జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌ తో నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో ఎంపీ వివాహం నిశ్చయించారు. ఆపై విశాఖపట్నంలో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు ఎంపీ కుటుంబసభ్యులు. ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. దేశంలోని ఎంపీలందరిలో కెళ్లా అత్యంత తక్కువ ఆస్తి కలిగిన ఎంపీగా కూడా మాధవి రికార్డుల్లో ఉన్నారు. ఈ పేద, గిరిజన ఎంపీ గురించి జాతీయ మీడియా కూడా ప్రత్యేక కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లయ్ గా, పీఈటీగా పని చేస్తూ ఉండిన మాధవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అరకు నుంచి ఎంపీగా నిలబెట్టారు. ప్రముఖ సీనియర్ లీడర్ కిషోర్ చంద్రదేవ్ ను మాధవి ఓడించి ఎంపీగా గెలిచారు.