సద్దుల బతుకమ్మ… ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు

Tea India Rajahmundry

సద్దుల బతుకమ్మ… ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు

తెలంగాణా\అక్టోబర్ 06(primenews)

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ఫైనల్‌కి చేరాయి. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సద్దుల బతుకమ్మ వేడుకల్ని అత్యంత అద్భుతంగా ఇవాళ జరపబోతున్నారు. ఇందుకోసం… తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం సరికొత్తగా దర్శనమిస్తున్నాయి. నేటి సాయంత్రం ఎల్బీ స్టేడియంలో మొదలయ్యే సద్దుల బతుకమ్మ సంబరాలు… ట్యాంక్ బండ్ మీదుగా సాగి… బతుకమ్మ ఘాట్ వరకూ కొనసాగుతాయి.అక్కడ ఆటపాటల తర్వాత… సద్దుల బతుకమ్మను నిమజ్జనంతో ఘనంగా సాగనంపనున్నారు. ఇలా తొమ్మిదో రోజు బతుకమ్మ సంబరాల్ని విజయోత్సవంలా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఈ కార్యక్రమంలో వేల మంది కళాకారులు… బతుకమ్మల ర్యాలీ నిర్వహించబోతున్నారు. వీటికి తోడు… హుస్సేన్ సాగర్‌లో వెలుగుల బతుకమ్మలను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రజలంతా తరలిరావాలని ప్రభుత్వం కోరింది.