13వ డివిజన్ లో ఘనంగా  శ్రీ దేవి అమ్మవారి నవరాత్రులు

Tea India Rajahmundry

13వ డివిజన్ లో ఘనంగా  శ్రీ దేవి అమ్మవారి నవరాత్రులు

రాజమహేంద్రవరం/అక్టోబరు 06 (primenews)

స్థానిక 13వ డివిజన్ అంబేద్కర్ నగరంలో సామూహిక కుంకుమ పూజలు బ్యానర్ సత్తిబాబు ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ పాలిక శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయం కమిటీ నిర్వహకులు తెలియజేశారు.కార్యక్రమానికి మహిళలు బారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమీటీ పాలిక శ్యాం, ఆర్యాపురం బ్యాంకు మాజీ డైరెక్టర్ సూరంపూడి శ్రీహరి, పోలవరపు బాబురావు, జి. సత్తిబాబు, వెంకట్రావు, ఎల్లా అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.